7 Jun 2011

మంచి మాట


స్వామి వేవేకానంద

స్వామి వివేకానంద ఈయన పేరు వినగానే ఆద్యాత్మిక ప్రబోదనలు,మన ముందు సాక్షాత్కారమవుతుంది ఐతే ఆ బోదనలు ప్రపంచవ్యాప్త్పంగా వినిపించడానికి అవకాసం అంత ఇజిగా రాలేదని చెప్పవచ్చు .
               స్వామి వివేకానందునికి "చికాగో " లో జరిగే అంతర్జాతీయ మతసామరస్య సమ్మేళనానికి బారత ప్రతినిదిగా స్వామి వివేకానందకి ఆహ్వాన్యం లభించింది.ఐతే అతను ఎంతో కష్టించి ఆ సభలకు  హాజరు కావడానికి చికాగో  బయలుదేరి వెళ్లారు.
                  స్వామి వివేకానందుని వేషదారణ చూసి ఆయనని సభలోనికి అనుమతించలేదు.ఆయన తిరుగు ప్రయాణానికి డబ్బులు లేని పరిస్థితి వచ్చింది. ఆరోజు ఆయనవిశ్రాంతి  కోసం ఒక గూడ్స్ రైలులో పడుకుని ఉన్నాడుగూడ్స్ రైలు కదిలి చికాగో నగరం దాటి 8 కోలో;మీటర్లు దూరంలో ఆగింది.ఆయన నిద్ర లేచి చూసేసరికి చికాగో నగరం దాటిపోయింది.  ఏమి చేయాలో తోచక ఆచలిలోనే మరల  8 కోలో;మీటర్లు నడిచి చికాగో నగరానికి ,చేరుకున్నారు.రెండవ రోజు సభకు  హాజరు కావాలని వచ్చి అక్కడే చలిలో వణుకుతూ ఒక పక్కగా కుర్చుని ఉన్నారు.ఈయనని ఒక మహిళ మేడ పై నుంచి చూసి స్వామి వివేకానందుని దగ్గరకు వచ్చి ఆయన గురించి తెలుసుకుని అసభలోనికి,అనుమతించడానికి ఒక లెటరు రాసి ఇస్తుంది.దీనినిచూపిస్తే  లోనికి అనుమతిస్తారని చెప్పి వెళ్ళిపోతుంది.స్వామి వివేకానందునికి , తిండి తినడానికి డబ్బులు లేని పరిస్థితి ఉంది .సభ ప్రారంభం కాగానే లెటరు చూపించి లోనికి వెళ్తాడు. ఐతే ఆయనకు 3 నిమిషాలు మాట్లాడేందుకు అవకాశం ఇచ్చారు. స్వామి వివేకానందుడు లేచి మొదటగా "Mydear Brothers and Sisters "అని అనగానే చప్పట్లతో సభా ప్రాగణం మారుమ్రోగింది.మన బారతీయ సంస్కుతిని ,సంప్రదాయాన్ని ఔనత్యాన్ని , గురించి మాట్లాడుతూ ఆయన 3 నిమిషాల గడువు కాస్త 3 గంటల వరకు చేరింది.అంతటి ఆద్యాత్మిక బావనలను వివరించి మన భారతదేశ కీర్తి ప్రతిష్టలను ఆద్యత్మికతలను ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పిన గణత ఆయనకే దక్కుతుంది.
                         ఆబోదనలు విన్న చాలామంది ఈయనను తమ దేశాలలో కూడా ప్రబోదనలను వినిపించాలని అతనికి ఆహ్వానాలను పంపిస్తారు. చాలామంది తమ ఇంటికి వచ్చి అతిద్యాన్ని స్వికరించమని పిలుస్తారు .ఒకరోజు ఆయన ఒకరింటికి బోజనానికి వెళ్లారు .వారు ఎంతోమర్యాదగా స్వామి వివేకానందుడినిఆహ్వానించి  వెండి కంచోలో ఆతిద్యం ఇస్తారు.విశ్రాంతి కోసం పట్టు పరుపులు నడవడానికి తివాచీలు ఇచ్చారు .ఆయన ఎంతో ప్రసాంతంగా  గదిలోనికి వెళ్లి చుట్టూ ఒకసారి చూసి తివాచిని మడతపెట్టి ఒక మూలగ కూర్చుని ఆలోచిస్తున్నాడు.నిన్నటి వరకు తినడానికి తిండి కూడా లేదు కానీ ఈరోజు ఇంతటి మర్యాద లభిస్తుంది అంటే కారణం మనలో ఉన్న ప్రజ్ఞా,పాటవాలు మాత్రమే  అనుకుని,
                నా భారతదేశం ఎంత దారిద్ర్యంలో ఉందొ కదా !నా ప్రజలందరూ ఒక పూటకూడా తిండి తినలేని పరిస్థితిలో ఉన్నారు.అలాంటిది నేను ఈ సుఖాలను ఎలా అనుభవించగలను?  అనుకొని క్రింద నేలపై పడుకుంటాడు.
                          ఆయన తిరిగి భారతదేశం తిరిగి వస్తున్నపుడు ఒక వ్యక్తి మీ భారత దేశం లో కరువు దారిద్ర్యం ఉంటుంది.మీరు  భారతదేశం ఎందుకు వెళ్తున్నారు.ఇక్కడ మీకు సఖలమర్యాదలు ,చాల డబ్బు సంపాదించుకోవచ్చు కదా!ఇక్కడే ఉండమని అడుగుతాడు.
                               కానీ , స్వామి వివేకానందుడు నా భారతదేశ ప్రజలందరినీ ,చైతన్యవతులను చేసి,దారిద్ర నిర్మూలనకు నేను పాటుపడతాను నా పేద ప్రజలకోసం జీవిస్తాను అని చెప్పి భారతదేశానికి తిరిగి వచ్చిన గొప్ప మహోన్నతమైన  వ్యక్తి స్వామి వివేకానంద.