7 Jun 2011

మంచి మాట


స్వామి వేవేకానంద

స్వామి వివేకానంద ఈయన పేరు వినగానే ఆద్యాత్మిక ప్రబోదనలు,మన ముందు సాక్షాత్కారమవుతుంది ఐతే ఆ బోదనలు ప్రపంచవ్యాప్త్పంగా వినిపించడానికి అవకాసం అంత ఇజిగా రాలేదని చెప్పవచ్చు .
               స్వామి వివేకానందునికి "చికాగో " లో జరిగే అంతర్జాతీయ మతసామరస్య సమ్మేళనానికి బారత ప్రతినిదిగా స్వామి వివేకానందకి ఆహ్వాన్యం లభించింది.ఐతే అతను ఎంతో కష్టించి ఆ సభలకు  హాజరు కావడానికి చికాగో  బయలుదేరి వెళ్లారు.
                  స్వామి వివేకానందుని వేషదారణ చూసి ఆయనని సభలోనికి అనుమతించలేదు.ఆయన తిరుగు ప్రయాణానికి డబ్బులు లేని పరిస్థితి వచ్చింది. ఆరోజు ఆయనవిశ్రాంతి  కోసం ఒక గూడ్స్ రైలులో పడుకుని ఉన్నాడుగూడ్స్ రైలు కదిలి చికాగో నగరం దాటి 8 కోలో;మీటర్లు దూరంలో ఆగింది.ఆయన నిద్ర లేచి చూసేసరికి చికాగో నగరం దాటిపోయింది.  ఏమి చేయాలో తోచక ఆచలిలోనే మరల  8 కోలో;మీటర్లు నడిచి చికాగో నగరానికి ,చేరుకున్నారు.రెండవ రోజు సభకు  హాజరు కావాలని వచ్చి అక్కడే చలిలో వణుకుతూ ఒక పక్కగా కుర్చుని ఉన్నారు.ఈయనని ఒక మహిళ మేడ పై నుంచి చూసి స్వామి వివేకానందుని దగ్గరకు వచ్చి ఆయన గురించి తెలుసుకుని అసభలోనికి,అనుమతించడానికి ఒక లెటరు రాసి ఇస్తుంది.దీనినిచూపిస్తే  లోనికి అనుమతిస్తారని చెప్పి వెళ్ళిపోతుంది.స్వామి వివేకానందునికి , తిండి తినడానికి డబ్బులు లేని పరిస్థితి ఉంది .సభ ప్రారంభం కాగానే లెటరు చూపించి లోనికి వెళ్తాడు. ఐతే ఆయనకు 3 నిమిషాలు మాట్లాడేందుకు అవకాశం ఇచ్చారు. స్వామి వివేకానందుడు లేచి మొదటగా "Mydear Brothers and Sisters "అని అనగానే చప్పట్లతో సభా ప్రాగణం మారుమ్రోగింది.మన బారతీయ సంస్కుతిని ,సంప్రదాయాన్ని ఔనత్యాన్ని , గురించి మాట్లాడుతూ ఆయన 3 నిమిషాల గడువు కాస్త 3 గంటల వరకు చేరింది.అంతటి ఆద్యాత్మిక బావనలను వివరించి మన భారతదేశ కీర్తి ప్రతిష్టలను ఆద్యత్మికతలను ప్రపంచ వ్యాప్తంగా చాటి చెప్పిన గణత ఆయనకే దక్కుతుంది.
                         ఆబోదనలు విన్న చాలామంది ఈయనను తమ దేశాలలో కూడా ప్రబోదనలను వినిపించాలని అతనికి ఆహ్వానాలను పంపిస్తారు. చాలామంది తమ ఇంటికి వచ్చి అతిద్యాన్ని స్వికరించమని పిలుస్తారు .ఒకరోజు ఆయన ఒకరింటికి బోజనానికి వెళ్లారు .వారు ఎంతోమర్యాదగా స్వామి వివేకానందుడినిఆహ్వానించి  వెండి కంచోలో ఆతిద్యం ఇస్తారు.విశ్రాంతి కోసం పట్టు పరుపులు నడవడానికి తివాచీలు ఇచ్చారు .ఆయన ఎంతో ప్రసాంతంగా  గదిలోనికి వెళ్లి చుట్టూ ఒకసారి చూసి తివాచిని మడతపెట్టి ఒక మూలగ కూర్చుని ఆలోచిస్తున్నాడు.నిన్నటి వరకు తినడానికి తిండి కూడా లేదు కానీ ఈరోజు ఇంతటి మర్యాద లభిస్తుంది అంటే కారణం మనలో ఉన్న ప్రజ్ఞా,పాటవాలు మాత్రమే  అనుకుని,
                నా భారతదేశం ఎంత దారిద్ర్యంలో ఉందొ కదా !నా ప్రజలందరూ ఒక పూటకూడా తిండి తినలేని పరిస్థితిలో ఉన్నారు.అలాంటిది నేను ఈ సుఖాలను ఎలా అనుభవించగలను?  అనుకొని క్రింద నేలపై పడుకుంటాడు.
                          ఆయన తిరిగి భారతదేశం తిరిగి వస్తున్నపుడు ఒక వ్యక్తి మీ భారత దేశం లో కరువు దారిద్ర్యం ఉంటుంది.మీరు  భారతదేశం ఎందుకు వెళ్తున్నారు.ఇక్కడ మీకు సఖలమర్యాదలు ,చాల డబ్బు సంపాదించుకోవచ్చు కదా!ఇక్కడే ఉండమని అడుగుతాడు.
                               కానీ , స్వామి వివేకానందుడు నా భారతదేశ ప్రజలందరినీ ,చైతన్యవతులను చేసి,దారిద్ర నిర్మూలనకు నేను పాటుపడతాను నా పేద ప్రజలకోసం జీవిస్తాను అని చెప్పి భారతదేశానికి తిరిగి వచ్చిన గొప్ప మహోన్నతమైన  వ్యక్తి స్వామి వివేకానంద.  

29 May 2011

మంచి మాట

 పుణ్యం చేస్తే స్వర్గానికి లేదా పాపం చేస్తే నరకానికి వెళతారు అనే నానుడి మనం వింటుంటాం.నిజానికి పుణ్యం చేయాలంటే ఆస్తిపాస్తులు ఉండాల్సిన పనిలేదు చేయాలనే మనసు ముక్యం.
               పూర్వం భూలోకాన ఒక మహిళ నివసిస్తూ ఉండేది.ఆమె చాల పిసినికొట్టు పరమ గయ్యాళి .తన జేవితకాలంలో ఒక పుణ్యకార్యం ఆయెన చేయలేదు. ఒక నాడు ఒక సాదువు బిక్షా కోసంఆమె  ముంగిటకు వచ్చాడు. .సాదువులకు బిక్షా వేయడం ఆనాటి ఉత్తమమైన ఆచారం కానీ ఆమె ఆచారాన్ని అతిక్రమించి సాదువుని కర్రతో కొట్టింది అయెతే ఆకర్రకు అతుక్కుని ఉన్న ఓ చిన్న మెతుకు సాదువు జోలెలో పడింది. దానినే జాగ్రత్తగా తీసి ఈస్వరార్పణం అంటూ పరమేశ్వరుడు కి సమర్పించి తన దారిన తను వెళ్ళిపోయాడు. కొంత కాలానికి ఆమె మరణించింది. యమధర్మరాజు ఆమె పాపపుణ్యాల చిట్టాలను విప్పమని చిత్రగుప్తుడికి ఆదేశిస్తాడు. ఆమె తన జీవితకాలంలో  ఎ చిన్న పుణ్యకార్యము చేయలేకపోయిన ఆమెకు తెలియకుండానే స్వల్పపుణ్యం సంపాదించిందని, ఓ సాదువుని కర్రతో కొట్టగా ఆకర్రకు ఉన్న ఓ మెతుకు  పరమేశ్వరుడుకి సమర్పించబడడంతో, ఆ పుణ్యంతో ఆమెకి బాగం కలిగిందని, ఈ కారణంగా ఆమెకి ఈశ్వర దర్సన భాగ్యం కలిగిందని, చిత్రగుప్తుడు చెప్తాడు. దీనితో ఆమెను శివబటులు కైలాసానికి తీసుకు పోయారు. అక్కడ ప్రసంతవతావరణం ఆమెను ఆనందబరితంచేసింది .జివిన్చినంతకాలం  పై లోకాల ఆలోచన లేకుండా పాపకార్యాలు చేయడం, ఎంత పొరపాటో గ్రహించింది. సరాసరి ఆ పరమేశ్వరుని పాదాలను ఆశ్ర ఎంచంది స్వామి నేను జీవించి ఉండగా చేసిన అపరాదాలను మన్నించి నన్ను నీ కొలువునందే ఉండేందుకు అనుగ్రహాన్ని ప్రసాదించు తండ్రి ,అని వేడుకుంది.
                    పుణ్యకార్యాలు చేయడానికి ఆస్తిపాస్తులు దానదన్యాలతో పనిలేదుఅని, మనకున్న దానిలోనో ఇతరులకు దానం చేసిన ఆ పుణ్యఫలం వృదగాపోదని ఈ ఇతివృత్తాన్ని బట్టి తెసుస్తుంది. 
                        అలాగే స్నేహితులతో ఇరుగుపొరుగు వారితో విరొదులతోకూడా ప్రేమతో ఉండడానికి ప్రయత్నించాలి .ఎదుటి వారి ప్రవర్తనను వారి సమస్యలను అర్ధం చేసుకునే నైపుణ్యం పెంచుకోవాలి .తమకన్నా తక్కువ స్థాఈలో ఉన్నవారికి, వయస్సులో చిన్నవారికి, వృద్ధులకి, సహాయమందించడం అందరితోను స్నేహంగా ఉండడం దయాగుణం,క్షమాగుణం పెంచుకోవాలి స్వర్దాగుణం తగ్గించుకోవాలి సాటి వారి గురించి ఆలోచించడము వారి సమస్యలను అర్ధం చేసుకొని స్పందించి చేతనైన సహాయం చేయడం వంటి కొన్ని ముక్యమైన విలువలకు ప్రాదాన్యం ఇవ్వడం ప్రతివారు చిన్నతనం నుండి అలవరుచుకున్నట్లేతే మన దేశ సంస్కృతీ సంప్రదాయాలను తప్పక కాపాడుకోగల్గుతాము.    
 
 
 
 
 

                                                        

17 May 2011

అమ్మ

అమ్మ ప్రేమ" ని మించిన ప్రేమ ఈ ప్రపంచం లో ఉంది అని ఎవరైనా చెపితే అది తప్పకుంఢా ఆబద్దమే...

ఎందుకంటే...

తెలుగు భాషలో అమ్మ అనే పదం కన్నా విలువ అయినది మరొకటిలేదుకాబట్టి.

మనసు కి గాయం అయితే మనసు పలికే చిన్న మాటే "అమ్మ".
శరీరాని కి గాయం అయితే పెదవుల వెంట వచ్చే రెండు అక్షరాల పలుకే "అమ్మా".

అమ్మ గురించి ఒక కవి ఏమన్నాడో తెలుసా ?కొలిస్తే నే పలికేది ఆ దేవుడు...కాని పిలవకుండానే పలికేది "అమ్మ మనసు" మాత్రమే..

ఒక విషయం గురించి మాట్లాడమంటే 1 గంట/రోజు/నెల మట్లాడవచ్చు. కాని అమ్మ గురించి మాట్లాడమంటే జీవితాంతం మాట్లాడుతూ నే ఉండవచ్చు....అదే "అమ్మ ప్రేమ".

"ప్రాణం" అనే పదం చాలా చిన్నది "అమ్మ" అనే మాట ముందు కాదు అనగలరా ఎవరైనా?

ఈ లోకం లో నువ్వు ద్వేషించినా కూడా నిన్ను ప్రేమించే వాళ్ళు ఉన్నారు అంటే అది కేవలం అమ్మ మాత్రమే.

అమ్మ ని ప్రేమించే ప్రతి ఒక్కరి కి స్వాగతం...సుస్వాగతం...అమ్మ గురించమట్లాడండి ఆ మాట కు ఉన్న విలువ ని మారింత పెంచండి...

ఒక్క మాట::అమ్మ గురించి మీకు తెలియదు అని కాదు..నాకు తెలిసింది మీతొ పంచుకోవడానికే ఈ "అమ్మ ప్రేమ" కమ్యూనిటీ.

కిరణానికి చీకటి లేదు......... సిరిమువ్వకి మౌనం లేదు...........

7 May 2011

అమ్మ

బీట్రూట్ హల్వా

బీట్రూట్  హల్వా
కావలసినవి :
   బీట్రూట్ తురుము ఒక కప్పు
  పంచదార :1 /2కప్పు
  పాలు:  1 /2కప్పు
 నెయ్ 2 స్పూన్స్
 ఏలకులపొడి 1 /4 స్పూన్స్
 జీడిపోప్పు 10
 
          తయారివిదానం:
 
పాన లో నెయ్యే వేసి వేడయ్యాక , పాలలో బీట్రూట్ తురుముకుని ఉన్నదాన్ని వేసి పచ్చి వాసన పోయేంతవరకు వేపుకోవాలి .వేగిన తురుమును ఉడికించుకోవాలి ఉడికాక  పంచదార వేసిదగ్గర వచ్చే  వరకు  కలుపుతూనే ఉండాలి . హల్వ ముద్దలా  అయ్యాక  దింపి యాలకుల  పొడి  వేసి కాజు  తో గార్నిస్ చేయాలి . 
                          

5 May 2011

తేనే పలుకులు

శాంతిని స్తాపించాలంటే స్నేహితులతో మాట్లాడకు ,శత్రువులతో మాట్లాడు .
                                                               (మోషే డయన్ ఎజ్రయాల్ సైనికదుపతి)

తేనే పలుకులు

వాస్తవాలకంటే,ఊహల గురించే తలచుకొని మనుషులు ఎక్కువ కలత చెందుతుంటారు.
                                                                 (జాలియస్ సిజర్ ,రోమన్

రుచులు

మామిడికాయ హల్వా
            కావలసినవి :
  • మామిడికాయ తురుము ఒక కప్పు                                                                      
  • జాపత్రి  కొచెం 
  • కుంకుమపువ్వు  కొంచం 
  • పంచదార ఒక కప్పు 
  • ఏలకుల పౌడర్ 1 /4  
  •  తయారివిదానం :మామిడి కాయ చెక్కు తీసుకుని తురుముకోవాలి పానులో మామిడితురుము,పంచదార ఒకే సారి వేసుకుని బ్రౌన్ కలర్ వచ్చేవరకు వేయున్చికోవాలి .ఆ మిశ్రమం దగ్గర అయ్యేంతవరకు కలుపుతూనే ఉండాలి.చివరగా జాజికాయ,జాపత్రి,కుంకుమ పువ్వు వేసి అయుదు నిముషాలు తర్వాత దింపు కోవాలి.ఈ హల్వా ఏడాది పాటు నిల్వ ఉంటుంది.    

25 Apr 2011

ప్రజాస్వామ్యం

నేడు ఆదునిక యుగంలో ప్రజాస్వామ్యం ఉందంటారా.ప్రజాస్వామ్య విలువలు ఉన్నాయా రాజకీయం అంటేనే డబ్బు .రాజకీయాలలోకి రావాలంటే కావలసింది సమాజసేవకు కాదు డబ్బు సంపాదనే లక్ష్యంగా బావిస్తున్నారు .దాని కోసమే.రాజకేయంలో కి వస్తున్నారు.కాని సమాజాన్ని బాగుచేయదానికో  లేక ప్రజలగురించో   కానే కాదు.అని  అనుకోవలసిన పరిస్తితులు దాపురించాయి ఎదుకంటే రాజకియనాయకులు అవనీతి కుమ్బకోనాలు ములిగిపోవడం వేల కోట్లు   స్విసు బ్యాంక్లో బేలన్సు ఇవన్నీ చూస్తె మనకే అర్ధమవుతుంది రాజకీయాలు అంటే ఏమిటో  ఇటీవల కుంబకోణం లో దొరికిన  టెలికాం మినిస్టర్ గారు గుర్తున్నారా .అయన గారి ఇల్లు చూస్తె ఇంద్రభవనం కుడా  బలదురే మీరు చుడండి రాజ గారి  ఇంద్రబవనం