29 May 2011

మంచి మాట

 పుణ్యం చేస్తే స్వర్గానికి లేదా పాపం చేస్తే నరకానికి వెళతారు అనే నానుడి మనం వింటుంటాం.నిజానికి పుణ్యం చేయాలంటే ఆస్తిపాస్తులు ఉండాల్సిన పనిలేదు చేయాలనే మనసు ముక్యం.
               పూర్వం భూలోకాన ఒక మహిళ నివసిస్తూ ఉండేది.ఆమె చాల పిసినికొట్టు పరమ గయ్యాళి .తన జేవితకాలంలో ఒక పుణ్యకార్యం ఆయెన చేయలేదు. ఒక నాడు ఒక సాదువు బిక్షా కోసంఆమె  ముంగిటకు వచ్చాడు. .సాదువులకు బిక్షా వేయడం ఆనాటి ఉత్తమమైన ఆచారం కానీ ఆమె ఆచారాన్ని అతిక్రమించి సాదువుని కర్రతో కొట్టింది అయెతే ఆకర్రకు అతుక్కుని ఉన్న ఓ చిన్న మెతుకు సాదువు జోలెలో పడింది. దానినే జాగ్రత్తగా తీసి ఈస్వరార్పణం అంటూ పరమేశ్వరుడు కి సమర్పించి తన దారిన తను వెళ్ళిపోయాడు. కొంత కాలానికి ఆమె మరణించింది. యమధర్మరాజు ఆమె పాపపుణ్యాల చిట్టాలను విప్పమని చిత్రగుప్తుడికి ఆదేశిస్తాడు. ఆమె తన జీవితకాలంలో  ఎ చిన్న పుణ్యకార్యము చేయలేకపోయిన ఆమెకు తెలియకుండానే స్వల్పపుణ్యం సంపాదించిందని, ఓ సాదువుని కర్రతో కొట్టగా ఆకర్రకు ఉన్న ఓ మెతుకు  పరమేశ్వరుడుకి సమర్పించబడడంతో, ఆ పుణ్యంతో ఆమెకి బాగం కలిగిందని, ఈ కారణంగా ఆమెకి ఈశ్వర దర్సన భాగ్యం కలిగిందని, చిత్రగుప్తుడు చెప్తాడు. దీనితో ఆమెను శివబటులు కైలాసానికి తీసుకు పోయారు. అక్కడ ప్రసంతవతావరణం ఆమెను ఆనందబరితంచేసింది .జివిన్చినంతకాలం  పై లోకాల ఆలోచన లేకుండా పాపకార్యాలు చేయడం, ఎంత పొరపాటో గ్రహించింది. సరాసరి ఆ పరమేశ్వరుని పాదాలను ఆశ్ర ఎంచంది స్వామి నేను జీవించి ఉండగా చేసిన అపరాదాలను మన్నించి నన్ను నీ కొలువునందే ఉండేందుకు అనుగ్రహాన్ని ప్రసాదించు తండ్రి ,అని వేడుకుంది.
                    పుణ్యకార్యాలు చేయడానికి ఆస్తిపాస్తులు దానదన్యాలతో పనిలేదుఅని, మనకున్న దానిలోనో ఇతరులకు దానం చేసిన ఆ పుణ్యఫలం వృదగాపోదని ఈ ఇతివృత్తాన్ని బట్టి తెసుస్తుంది. 
                        అలాగే స్నేహితులతో ఇరుగుపొరుగు వారితో విరొదులతోకూడా ప్రేమతో ఉండడానికి ప్రయత్నించాలి .ఎదుటి వారి ప్రవర్తనను వారి సమస్యలను అర్ధం చేసుకునే నైపుణ్యం పెంచుకోవాలి .తమకన్నా తక్కువ స్థాఈలో ఉన్నవారికి, వయస్సులో చిన్నవారికి, వృద్ధులకి, సహాయమందించడం అందరితోను స్నేహంగా ఉండడం దయాగుణం,క్షమాగుణం పెంచుకోవాలి స్వర్దాగుణం తగ్గించుకోవాలి సాటి వారి గురించి ఆలోచించడము వారి సమస్యలను అర్ధం చేసుకొని స్పందించి చేతనైన సహాయం చేయడం వంటి కొన్ని ముక్యమైన విలువలకు ప్రాదాన్యం ఇవ్వడం ప్రతివారు చిన్నతనం నుండి అలవరుచుకున్నట్లేతే మన దేశ సంస్కృతీ సంప్రదాయాలను తప్పక కాపాడుకోగల్గుతాము.    
 
 
 
 
 

                                                        

5 comments:

  1. Anonymous03 June, 2011

    This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  2. Anonymous03 June, 2011

    ratna chla bhagundi

    ReplyDelete
  3. ఎన్ని మంచి విషయాలు చర్చించారండి. కాని ఎంత ఆచరించగలమో కదా.

    ReplyDelete
  4. నా కామెంట్లు ఎవ్వరూ ప్రచురించట్లేదు ...వాఅ.....

    ReplyDelete
  5. mamchi maatalu enta simple ga cheptunnarandi! abhinandanlau!!

    ReplyDelete

sairatnamala.blogspot.com