17 May 2011

అమ్మ

అమ్మ ప్రేమ" ని మించిన ప్రేమ ఈ ప్రపంచం లో ఉంది అని ఎవరైనా చెపితే అది తప్పకుంఢా ఆబద్దమే...

ఎందుకంటే...

తెలుగు భాషలో అమ్మ అనే పదం కన్నా విలువ అయినది మరొకటిలేదుకాబట్టి.

మనసు కి గాయం అయితే మనసు పలికే చిన్న మాటే "అమ్మ".
శరీరాని కి గాయం అయితే పెదవుల వెంట వచ్చే రెండు అక్షరాల పలుకే "అమ్మా".

అమ్మ గురించి ఒక కవి ఏమన్నాడో తెలుసా ?కొలిస్తే నే పలికేది ఆ దేవుడు...కాని పిలవకుండానే పలికేది "అమ్మ మనసు" మాత్రమే..

ఒక విషయం గురించి మాట్లాడమంటే 1 గంట/రోజు/నెల మట్లాడవచ్చు. కాని అమ్మ గురించి మాట్లాడమంటే జీవితాంతం మాట్లాడుతూ నే ఉండవచ్చు....అదే "అమ్మ ప్రేమ".

"ప్రాణం" అనే పదం చాలా చిన్నది "అమ్మ" అనే మాట ముందు కాదు అనగలరా ఎవరైనా?

ఈ లోకం లో నువ్వు ద్వేషించినా కూడా నిన్ను ప్రేమించే వాళ్ళు ఉన్నారు అంటే అది కేవలం అమ్మ మాత్రమే.

అమ్మ ని ప్రేమించే ప్రతి ఒక్కరి కి స్వాగతం...సుస్వాగతం...అమ్మ గురించమట్లాడండి ఆ మాట కు ఉన్న విలువ ని మారింత పెంచండి...

ఒక్క మాట::అమ్మ గురించి మీకు తెలియదు అని కాదు..నాకు తెలిసింది మీతొ పంచుకోవడానికే ఈ "అమ్మ ప్రేమ" కమ్యూనిటీ.

కిరణానికి చీకటి లేదు......... సిరిమువ్వకి మౌనం లేదు...........

2 comments:

  1. బాగా రాస్తున్నారండి. బాగుంది మీ బ్లాగు.

    ReplyDelete
  2. chakkaga rasaaru...mari e mothers day ki meerenduku spandichaledu.. asalu blogging enduku aapesaru? continue..madam!

    ReplyDelete

sairatnamala.blogspot.com